యుట్యూబ్ తెరపై కన్నేసింది
యుట్యూబ్ తెరపై కన్నేసింది https://www.youtube.com/channel/UCUJh7V52HcxzD4thwolb6hg subscribe my channel నేను హీరోని కాను నటుడును అని హీరో రానా చాలా ఇంటర్వ్యూలలో చెబుతూ వస్తున్నాడు. ఇప్పుడు అదే మాటను మళ్ళీ మళ్ళీ నిజం చేస్తూ కొత్త కొత్త కథలతో మన ముందుకు వస్తున్నాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో జోగేంద్ర పాత్రలో నటించి మెప్పించాక.. ‘సోషల్ ’ అనే ఫిక్షన్ డ్రామా వెబ్ సిరీస్ లో నటించబోతోన్నాడు. ఈ వెబ్ సిరీస్ ఒక అమ్మాయి కిడ్నాప్ కేసు చుట్టూ ఉండబోతోందని టాక్. ఈ వెబ్ సిరీస్ లో మరి లీడింగ్ లేడీ ఎవరో తెలుసా?? 'జోరు' ‘అసుర’ వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించిన ప్రియా బెనర్జీ ఉంది చూశారూ.. ఆ అమ్మడు ఆ ఛాన్స్ పట్టేసింది. ఈ వెబ్ సిరీస్ లో నాకు మంచి పాత్రలో నటించే అవకాశం వచ్చింది అంటున్న ప్రియ.. కమర్షియల్ విలువలు ఉంటూనే నటించడానికి చక్కని అవకాశం ఉందంటూ హొయలు పోయింది. అంటే వెబ్ సిరీస్ లో కూడా కమర్షియల్ విలువలు ఏంటబ్బా అని అందరూ షాకవ్వాల్సిందేలే. నటి కావాలి అనుకునే ఒక అమ్మాయి పాత్రలో నటిస్తోందట. ఇంటర్నెట్ - సోషల్ మీడియా యుగంలో చిన్న అవకతవకలు జరగటం మూలంగా ఒక అమ్మాయి జ...